Motivational : ఈ తప్పులను జీవితంలో అస్సలు చెయ్యకండి… చేస్తే ఇక అంతే..

-

Motivational : జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకుపోవాలన్నా, విజయాన్ని సాధించాలన్నా కూడా ముందు మనం చేసిన తప్పులను సరి దిద్దుకోవాలి… ఆ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి.. కొన్ని పొరపాట్లు అస్సలు చెయ్యొద్దని చాణిఖ్య నీతి చెబుతుంది.. ఎటువంటి పొరపాట్లు చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఏదైన పని చేసేటప్పుడు ఎప్పుడూ భయపడవద్దు.. ఎప్పుడూ వైఫల్యం సంబంథించిన ఆలోచన మీ మనస్సులోకి ప్రవేశించనివ్వవద్దు. మనస్సులో అపజయానికి సంబంధించిన ఆలోచనలు ఉన్న వ్యక్తికి విజయం దగ్గరవడం చాలా కష్టం. ఓటమి భయం ఉన్న ప్రతి పనిని అర్ధంతరంగా వదిలేస్తారు..అందుకే భయాన్ని దగ్గరకు తీసుకురావద్దు..

వేరేవారిని చూస్తూ ఏ పనీ చేయకండి. మీకు ఏ ఉద్యోగం సరైనదో, ఫలితాలు ఎలా ఉండవచ్చో నిర్ణయించుకోవడానికి ఎల్లప్పుడూ మీ సామర్థ్యంపై దృష్టి పెట్టండి. చేస్తున్న పనిలో విజయం సాధించగలనా లేదా అని నిర్ణయించండి.. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే విజయాన్ని త్వరగా చేరుకుంటాము..

ఒకపనిని మొదలు పెట్టినప్పుడు ఎప్పుడూ దానిని అసంపూర్తిగా వదలకండి.. ఒక్కోసారి కష్టపడి సగం వరకు చేరుకుని విజయం చూడకుండానే మనసు మార్చుకుంటారు. ఇలా చేయవద్దు.. ఏదైన తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందుకు సాగాలి.. అప్పుడే విజయాన్ని అందుకుంటారు.. ఏదైన సాధించాలి అనే కోరిక ఉంటే సరిపోదు.. ఆ కోరికను తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు చెయ్యాలి.. అప్పుడే జీవితంలో పైకి అనుకున్న విజయాన్ని సొంతం అవుతుంది..

ఇక చివరగా కొన్ని విషయాలను ముందుగా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.. పని పూర్తి అయిన తర్వాత మాత్రమే షేర్ చేసుకోవాలి.. అప్పుడే పూర్తిగా పని పూర్తి అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version