కాంగ్రెస్​ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే అభయహస్తం పేరుతో మరిన్ని హామీలు ప్రజల ముందుంచింది. అందులో ఒకటి జాబ్ గ్యారెంటీ. తెలంగాణలో గురువారం కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువదీరనున్న నేపథ్యంలో తొలి ఉద్యోగాన్ని ఇవ్వనున్నారు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి.  హైదరాబాద్​ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్​ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది.

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఇచ్చిన జాబ్​ గ్యారెంటీలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే రజినీకి ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీకి మొదటి ఉద్యోగం ఇస్తానని రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆ మాటను నిలబెట్టుకోనున్నారు.

అక్టోబరు నెలలో ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేస్తున్న రేవంత్​ రెడ్డి వద్దకు ఓ దివ్యాంగ మహిళ రజినీ వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా తనకు ఏ ఉద్యోగం రాలేదని తన ఆవేదనను చెప్పుకుంది. ఆమె సమస్యను విన్న రేవంత్​ రెడ్డి కాంగ్రెస్​ రాగానే తొలి ఉద్యోగం ఆమెకు ఇస్తానని మాట ఇచ్చారు. ఇది రేవంత్​ గ్యారెంటీ అంటూ అనంతరం ఆయనే స్వయంగా ఆరు గ్యారెంటీ కార్డులో ఆమె పూర్తి వివరాలను అడిగి నమోదు చేశారు. ఇక రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఉద్యోగం రజినీకి ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version