తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయన కుమారుడికి సీట్లు దక్కాయి. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ దక్కగా.. మెదక్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు సీటు దక్కించుకున్నారు.

ఇక.. బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం వినోద్‌.. మంచిర్యాల -ప్రేమ్‌సాగర్‌రావు, నిర్మల్‌ – శ్రీహరి రావు, ఆర్మూర్‌ -వినయ్‌ కుమార్‌రెడ్డి, బాల్కొండ- ముత్యాల సునీల్‌కుమార్‌, బోధన్ – పి.సుదర్శన్‌రెడ్డి, జగిత్యాల – టి.జీవన్‌రెడ్డి, ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం -ఎం.ఎస్‌.రాజ్‌ఠాకూర్‌, మంథని -దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి – చింతకుంట విజయరమణారావు, వేములవాడ – ఆది శ్రీనివాస్‌, మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ, ఆంధోల్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జగ్గారెడ్డికి చోటు దక్కింది. జహీరాబాద్‌- ఆగం చంద్రశేఖర్‌, గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డి , మేడ్చల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తోటకూర వజ్రేశ్‌ యాదవ్​లకు సీటు లభించింది.

55 మందితో తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా

Read more RELATED
Recommended to you

Exit mobile version