రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అభిషేక్ మను సింఘ్వి

-

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి సహా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింఘ్వీ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తనవంతు తోడ్పడతానని తెలిపారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సింఘ్వీ తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికవడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై రాజ్యసభలో పోరాడతారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అభిషేక్ సింఘ్వీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం అని.. సింఘ్వీ వల్ల మన రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version