సైబర్ నెరగాళ్ళ నుంచి 85 కోట్లు వసూల్ చేసిన సెక్యూరిటీ బ్యూరో..!

-

ఈ టెక్నాలజీ కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే. దాంతో సైబర్ నేరంలో డబ్బులు పోయిన వార్తలే మనం ఎక్కువగా చుస్తునాం. కానీ తాజాగా సైబర్ నెరగాళ్ళ నుంచి భారీగా డబ్బులు వెనక్కి తీసుకు వచ్చింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ క్రైమ్స్ ద్వారా పోగొట్టుకున్న 85 కోట్ల రూపాయలను బాధితులకు రిఫండ్ చేయించింది బ్యూరో.

మార్చి నుంచి జూలై వరకు సైబర్ మోసాలకు గురైన వారికి డబ్బులు రీఫండ్ అయ్యేలా చేసింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. 6,449 కేసుల్లో బాధితులకు రి ఫండ్ చేయించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో… సైబరాబాద్ పరిధిలో అత్యధికంగా 36.8 కోట్ల మనీ రీఫండ్ చేసింది. అలాగే ఇక మీదట సైబర్ క్రైమ్ కి గురయ్యామని గ్రహిస్తే వెంటనే 1930 కి కాల్ చేయాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. గోల్డెన్ హవర్ లో కంప్లెయింట్ చేస్తే డబ్బులు తిరిగి పొందవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version