భారతీయులే టార్గెట్.. సైబర్ క్రిమినల్స్ గా మార్చి..?

-

కంబోడియా కేంద్రంగా అమాయకులకు వల పనుతుంది ఓ ముఠా. మంచి ఉద్యోగం, అశిషించిన జీతం అంటూ ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ కేసులో ముంబైకి చెందిన ప్రియాంక శివకుమార్ అనే ఏజెంట్ ను అరెస్ట్ చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఒక్కో బాధితుడు నుండి 30,000 తీసుకుంది ప్రియాంక. కంబోడియాకు బాధితులను పంపించేందుకు వీసాలు అరేంజ్ చేస్తు.. ఒక్కో వ్యక్తిని సైబర్ నేరాలు చేసేందుకు చైనీస్ కంపెనీకి రిక్రూట్ చేస్తుంది ప్రియాంక.

ఒక్కో రిక్రూట్మెంట్ కు ప్రియాంకకు 500 డాలర్లు ఇస్తుంది మాఫియా. కాంబోడియాలో భారత్ నుండి వెళ్తున్న వారిని సైబర్ క్రిమినల్స్ గా మార్చి కోట్లు కొట్టేస్తుంది ముఠా. వెళ్లిన 3 రోజులకే విషయం తెలుసుకుని తిరిగి ఇండియా పంపాలని వేడుకుంటున్నారు బాధితులు. చెప్పిన పని చేయకుంటే బాధితులను మానసికంగా హింసిస్తున్నారు నిందితులు. ఈ క్రమంలో నిందితుల చెర నుండి తప్పించున్నారు పలువురు బాధితులు. ఉద్యోగం పేరుతో సైబర్ నేరం చేయాలని ఒత్తిడి చేస్తూ.. నెలల పాటు వేధింపులకు పాల్పడిన తర్వాత తిరిగి బాధితుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు నిందితులు. కాబట్టి మంచి జీవితం విదేశాల్లో ఉద్యోగం అంటూ చేసే ప్రకటనలను నమ్మేముందు ఆలోచించాలని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version