సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయడం చాలా కష్టం… గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు.

-

గవర్నర్ తమిళి సైకి సీఎం కేసీఆర్ కు మధ్య విభేదాలు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తమిళి సై తనను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానపరుస్తుందంటూ సంచన వ్యాఖ్యలు చేశారు. కనీసం తన తల్లి చనిపోతే పరామర్శించడానికి కూడా సీఎం రాలేదంటూ తన ఆవేధన వ్యక్త పరిచారు. తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లాలంటే… రోడ్డుమార్గమే గతి అంటూ తనకు హెలికాప్టర్ కేటాయించకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తారని జరగుతున్న ప్రచారంపై స్పందించారు. సీఎం కేసీఆర్ తో పనిచేయడం పెద్ద సవాల్ అని అన్నారు. సీఎం చెప్పారని ప్రతీ ఫైల్ పై సంతకం చేయడానికి నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎంలు నియంతలుగా మారుతున్నారని… ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తమిళి సై అన్నారు. నేను ఇద్దరు సీఎంలతో పనిచేస్తున్నానని, తెలంగాణ, పుదుచ్చేరి సీఎంలు భిన్నమైన వారని… వారితో పనిచేసిన తర్వాత ఎక్కడైనా పనిచేయగలననే నమ్మకం వచ్చిందని అన్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం మొదలు పెట్టారని.. గవర్నర్ అని చూడకుండా విమర్శిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తనని వేరే రాష్ట్రానికి మారుస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version