గృహజ్యోతి పధకం లబ్దిదారులకు గుడ్న్యూస్. ఈ లబ్దిదారులు ఇళ్లు మారినప్పుడు, ఆహార భద్రత కార్డు, సర్వీస్ కనెక్షన్ అనుసంధానం లోపాలతో గృహ జ్యోతి పధకం లబ్ది పొందలేకపోతున్నారు. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వివిధ వర్గాల నుంచి అందుతున్న అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పథకంలో సవరణలు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించింది. ప్రజా పాలన సేవ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్ నెంబర్‌ను సరి చేసుకునేందుకు ఇళ్లు మారినా తిరిగి గృహ జ్యోతి పథకం పొందేందుకు వెసులు బాటు కల్పించింది. ఈ విషయాన్ని TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో వినియోగదారులు అందజేసిన దరఖాస్తుల్లో విద్యుత్ కనెక్షన్ నంబరును తప్పుగా నమోదు చేసినవారికి సవరణ అవకాశం కల్పించి జీరో బిల్లులు జారీ చేస్తామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల కరెంట్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.