మరో రికార్డ్ సృష్టించిన తెలంగాణ సర్కార్ దవాఖానా.. ఒక్క ఆగస్టులోనే 76.3శాతం ప్రసవాలు

-

తెలంగాణలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర సర్కార్ ఇప్పటికే పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బస్తీ దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తీసుకువస్తోంది. మరోవైపు సర్కార్ దవాఖానాల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రికార్డులను సృష్టిస్తోంది.

తాజాగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆగస్టు మాసంలో 76.3 శాతం ప్రసవాలు జరిగాయి. ఒక్క నెలలో ఇంత శాతం ప్రసవాలు జరగడం చరిత్రలో సరికొత్త రికార్డని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, వైద్యారోగ్య శాఖ కృషితో తొమ్మిదేళ్ల క్రితం ప్రభుత్వాస్పత్రుల్లో  30శాతంగా ఉన్న ప్రసూతిలు రెట్టింపును మించాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనంగా మంత్రి పేర్కొన్నారు.

ఈ మేరకు ఆశాలు, ఏఎన్​ఎంలు, వైద్యాధికారులతో హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్  ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతిల విషయంలో వెనకబడిన జగిత్యాల, కుమ్రంభీం, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని మంత్రి సూచించారు. ఏ ఒక్క గర్బిణీ పరీక్షల కోసం ప్రైవేటుకు వెళ్లొద్దనే ఉద్దేశంతో టిఫా సహా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version