కాళేశ్వరంపై కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

-

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సభలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని వెల్లడైంది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని, రీ ఇంజినీరింగ్‌, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని నివేదిక పేర్కొంది. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని.. డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని వెల్లడించింది. డీపీఆర్‌ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని వివరించింది.

“అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు. అదనపు టీఎంసీ వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం జరిగింది. సాగునీటిపై మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51 గా అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 0.75గా తేలుతోంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశముందియ లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మించారు.” అని కాగ్ నివేదిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version