సర్కారు బడి విద్యార్థులకు బూట్లు, బ్యాగ్‌, టై, బెల్టు పంపిణీ!

-

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు త్వరలో పాఠశాల విద్యాశాఖ తీపికబురు చెప్పబోతోంది. వారికి బూట్లు, సాక్సులు, బ్యాగులు, టై, బెల్టు పంపిణీ చేయాలనే యోచన చేస్తోంది. దీన్ని సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ద్వారా అందజేయాలన్న లక్ష్యంతో ఉంది. వచ్చే నెలలో జరిగే ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) సమావేశంలో కేంద్ర విద్యాశాఖకు దీని గురించి ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం అమలుకు దాదాపు రూ.290 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో చాలా మంది రోజూ కనీసం చెప్పులు లేకుండానే వస్తూ వేసవిలో తారు, సిమెంట్‌ రోడ్లపై నడవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే బూట్లు అందజేస్తే లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ సమగ్ర శిక్షా అభియాన్‌ కింద వాటిని ఇచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ అంగీకరించకుంటే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version