పొరపాటున కూడా వీటిని ముఖానికి అప్లై చేయవద్దు.. చాలా ప్రమాదం

-

ముఖంపై మెరుపును తీసుకురావడానికి అనేక రకాల DIY హక్స్‌ను ఇప్పుడు ఇంట్లోనే ట్రై చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఈ హక్స్ చర్మంపై భారీ నష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇది మెరుగైన ఫలితాలను ఇవ్వదు. చర్మానికి హాని కలిగించవచ్చు. ముఖానికి దూరంగా ఉంచవలిసిన కొన్ని ఉండవలసిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఎందుకంటే.. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనే ముఖానికి అప్లై చేయకూడదు.

టూత్‌పేస్ట్

చాలా మంది ముఖంలో మొటిమల సమస్య వచ్చినప్పుడు ఆలోచించకుండా టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తుంటారు. మొటిమలు త్వరగా నయమైనప్పటికీ, ఇది చర్మానికి మంచిది కాదు. టూత్‌పేస్ట్‌లో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి మీ చర్మానికి చాలా కఠినంగా ఉంటాయి. దీని వల్ల చర్మం బాగా పొడిబారడంతోపాటు చికాకు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.

బేకింగ్‌ సోడా

ఈ రోజుల్లో బేకింగ్ సోడాను చర్మానికి వాడే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ట్యాన్‌ పోతుందని చాలా మంది బేకింగ్‌ సోడాలో నిమ్మరసం వేసి అప్లై చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదం. బేకింగ్ సోడా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీన్ని నేరుగా చర్మంపై ఎప్పుడూ అప్లై చేయవద్దు. బేకింగ్ సోడాను నీటిలో కలిపి అప్లై చేయవచ్చు, అయితే మీ చర్మం సున్నితంగా ఉంటే దానిని అప్లై చేయకపోవడమే మంచిది.

చక్కెరతో స్క్రబ్ చేయడం

స్క్రబ్బింగ్ కోసం చక్కెర మంచి ఎంపికగా పరిగణించబడుతుంది, అయితే దీనికి చాలా జాగ్రత్త అవసరం. మీరు చక్కెరతో మీ చేతులు మరియు కాళ్ళను స్క్రబ్ చేయవచ్చు, కానీ మీ ముఖం మీద చర్మం సున్నితంగా ఉంటుంది. చక్కెర చాలా గరుకుగా ఉంటుంది. కాబట్టి చక్కెరతో స్క్రబ్బింగ్ చేయవద్దు. అయినప్పటికీ చేస్తే.. సెన్సిటివ్‌ స్కిన్ వాళ్లకు అది ఎరుపు, దద్దుర్లు మరియు చికాకు కలిగించవచ్చు.

వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ముఖంపై అప్లై చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే మీ చర్మం పొడిగా లేదా సున్నితంగా ఉంటే వెనిగర్‌ని అప్లై చేయడం వల్ల మీ ముఖానికి చాలా హాని కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version