‘గురుకుల’ పోస్టుల భర్తీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

-

గురుకుల అభ్యర్థులకు గురుకుల నియామక బోర్డు అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,120 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది. తాజా మార్పుల ప్రకారం ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.

పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటాయని.. అభ్యర్థులు తమ వివరాలతో గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయని బోర్డు తెలిపింది. పరీక్షల సవరణ షెడ్యూలును వెబ్‌సైట్లో పొందుపరిచామని.. అభ్యర్థులు పరీక్ష తేదీలను మరోసారి చూసుకోవాలని సూచించింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయని పేర్కొంది. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుందని బోర్డు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version