గోదావరి నది ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ధవలేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా చేరుతోంది వరద నీరు. రాబోయే మూడు రోజుల్లో సుమారు 5, లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి 1,90,000 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు అధికారులు.
వరద ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. గోదావరి తీర ప్రాంత ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆలమూరు మండలం బడిగువానిలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక, కేదారిలంక ,పాలేపులంక, కే గంగవరం మండలం శేరిలంక కోటిపల్లి, పి గన్నవరం మండలం జీ పెదపూడి గ్రామాల్లో ఎనిమిది బోట్లు సిద్దం చేశారు. అటు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004252532, ధవలేశ్వరం కంట్రోల్ రూమ్ నెంబర్ 0883 2417066 ఏర్పాట్లు చేశారు అధికారులు.