తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మరో వివాదానికి తెరలేపారు. తాజాగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కతూ అడ్డంగా బుక్కయ్యారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ…ఉంటున్న శ్రీనివాస రావు.. కేసీఆర్ కాళ్లు మొక్కతు కనబడటం హాట్ టాపిక్‌గా మారింది. నిన్న టీఆర్ఎస్ భవన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే.. ఈ సంఘటనపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందించారు. కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడమంటూ చురకలు అంటించారు. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారని నిప్పులు చెరిగారు మురళి. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారంటూ కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియోను షేర్ చేశారు.
కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో👇 pic.twitter.com/VmX8DZYc5C
— Murali Akunuri (@Murali_IASretd) November 16, 2022