సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా ప్రేక్షకులను కలచి వేస్తోంది.సూపర్ స్టార్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా టెక్నాలజీకి సంబంధించిన అనేక కొత్త అంశాలను పరిచయం చేశారు. సాహసాల కృష్ణగా నిలిచిపోయారు. హీరోగా అనేక రకాల పాత్రలు చేశారు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఒక ఇంటర్వ్యూ లో విజయనిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారి మనస్తత్వం గురించి తెలియచేసారు. అప్పట్లో షూటింగ్ లో వుంటే కృష్ణ గారు ఎవరితో ఎక్కువుగా మాట్లాడే వారు కాదు. తన పని తాను చేసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ, కోపమన్నదే లేకుండా శాంతంగా ఉండేవారు. ఆడవాళ్ల తో మాట్లాడాలి అంటే బాగా సిగ్గుపడుతూ ఉండే వారు. అందుకే ఆయన మనస్తత్వం నచ్చి, పెళ్ళి చేసుకోవాలని కోరుకున్నాను అని చెప్పుకొచ్చారు.
అలాగే అప్పట్లో ఆయన గ్లామర్ కి హీరోయిన్స్ అందరూ మైమరిచి పోయే వారు. అందుకే అందరూ ఆయన తో మాట్లాడాలి అని ,కొంత మంది ముగ్గులోకి దింపడానికి ప్రయత్నం చేసేవారు. కృష్ణ గారికి వారితో కళ్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలి అంటే తెగ ఇబ్బంది పడుతూ ఉండేవారు. దానితో నేను ఆయనకి నల్ల కళ్ళద్దాలు పెట్టి కవర్ చేసే దాన్నని చెప్పుకొచ్చారు.అలాగే హీరోయిన్స్ కళ్ళు కృష్ణ గారి మీద పడకుండా, కూడా జాగర్త పడుతూ ఉండే దానినని విజయ నిర్మల గారు నవ్వుతూ చెప్పుకొచ్చారు.