హైడ్రాకు మరోసారి మొట్టికాయలు వేసిన తెలంగాణ హైకోర్టు !

-

హైడ్రాకు మరో షాక్ తగిలింది. హైడ్రాకు మరోసారి మొట్టికాయలు వేసింది తెలంగాణ హైకోర్టు. అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. సున్నం చెరువు వద్ద ఎలాంటి సర్వే నిర్వహించకుండా, నోటీసులు జారీ చేయకుండా, ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి అక్రమ నిర్మాణాల పేరుతో ఇండ్లు కూల్చుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు బాధితులు.

hydra
hydra

ఈ పిటిషన్‌ను విచారిస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, పిటిషనర్లు సమర్పించిన పత్రాల్లో ఎలాంటి తప్పులు లేవని తేల్చి చెప్పింది హైకోర్టు. సున్నం చెరువు పునరుద్ధరణకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని, అప్పటివరకు సున్నం చెరువు వద్ద ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాకు అదేశాలు జారీ చేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news