భద్రాచలం కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గపోరు… తెల్లం వెంకట్రావు Vs పొదెం వీరయ్య !

-

భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. తెల్లం వెంకట్రావు Vs పొదెం వీరయ్య అన్నట్లుగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు పై అసంతృప్తి వ్యక్తం చేశారు పొదెం వీరయ్య. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు.. వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడని పేర్కొన్నారు.

Tellam Venkat Rao Vs Podem Veeraiah
Tellam Venkat Rao Vs Podem Veeraiah

ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుందన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తాను అన్నారు పొదెం వీరయ్య.

Read more RELATED
Recommended to you

Latest news