సుఖేష్ గుప్తాపై ఈడీ కేసులో హైకోర్టు స్టే

-

MMTC నుంచి బంగారం కొనుగోలు వ్యవహారంలో ఎంబీఎస్‌ అధినేత సుఖేష్‌గుప్తాపై ఈడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఒప్పందం ప్రకారం అదనపు సొమ్ము చెల్లించకపోవడం ద్వారా ఎంఎంటీసీకి రూ.200 కోట్ల నష్టానికి కారణమైన ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌తో పాటు యజమాని సుఖేష్‌గుప్తాపై 2013లో సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ కేసు పెట్టింది.

దాన్ని కొట్టివేయాలంటూ 2019లో వేేసిన పిటిషన్‌ను 2022 ఫిబ్రవరిలో కొట్టివేస్తూ తీర్పివ్వగా, తాజాగా గుప్త మరో పిటిషన్‌ వేేశారు. దీనిపై జస్టిస్‌ కె.సురేందర్‌ విచారణ చేపట్టారు.గతంలో సుఖేష్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని, అయితే ఆస్తుల జప్తు నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పుందంటూ మరో పిటిషన్‌ను దాఖలు చేసినట్లు పిటిషనర్‌ పేర్కొన్నారని న్యాయమూర్తి తెలిపారు.

ఒకసారి పిటిషన్‌ కొట్టివేశాక అదే అభ్యర్థనతో వేేసిన పిటిషన్‌ విచారణార్హతపై ఈడీ తరఫు న్యాయవాది ఏ అభ్యంతరం చెప్పలేదన్నారు. రూపాయి మారకం వల్ల డిపాజిట్‌ సొమ్ములో తేడా వచ్చినపుడు అది నేరపూరిత సొమ్ము అవునోకాదో తేలాల్సి ఉందని, ఈ విషయాన్ని గత పిటిషన్‌లో హైకోర్టు ప్రస్తావించలేదన్నారు. అందువల్ల అది తేలే వరకు ఈడీ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version