” తెలంగాణ విమోచన దినం” కమ్యూనిస్టుల త్యాగం – కెవిపి రామచంద్ర రావు

-

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం కమ్యూనిస్టుల త్యాగం అన్నారు కేవీపీ రామచంద్ర రావు. సాయుధ పోరాటంలో పాల్గొన్న త్యాగదనులను స్మరించుకోవాలన్నారు. అందుకనే కమ్యూనిస్టు నాయకుడు, రైతు నాయకుడు రావి నారాయణరెడ్డిని నెహ్రూ స్వయంగా కలవాలని భావించారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ పిలుపుమేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారని అన్నారు.

ఆ రోజుల్లోనే నెహ్రూ అత్యంత సంపన్నమైన కుటుంబంలో జన్మించారని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని యవ్వనంలో జైలులో గడిపిన నెహ్రూను కర్ణాటక పాఠ్య పుస్తకాల నించి తొలగించడం దౌర్భాగ్యం అన్నారు. జవహర్లాల్ నెహ్రూ తో పాటు.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా మనందరం స్మరించుకుందామని పిలుపునిచ్చారు. భారత సమాజాన్ని విడదీయాలని ప్రస్తుత బిజెపి మాతృ సంస్థలైన ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ ప్రయత్నాలు చేసిందన్నారు.

ప్రస్తుత సమాజంలో వైషమ్యాలు పెచ్చు మీరి పోయేలా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపూరిత వాతావరణం, వైశాల్యాలను అధిగమించేలా, జాతీయ భావాలు పెంపొందేలా రాహుల్ గాంధీ చేసే ఈ బృహత్తర ప్రయత్నానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version