నేను మాట్లాడితే మైండ్ బ్లాక్ అయి అసెంబ్లీ నుంచి బయటకి వెళ్లిపోతున్నారని చురకలు అంటించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… మేము పని ఎక్కువ చేస్తాం కానీ ఎక్కువ మాట్లాడలేమన్నారు. హరీష్ రావు మాటలు బాధ అనిపిస్తాయని…. రోడ్ల నిర్మాణం స్పెషల్ ఫోకస్ గా చూస్తామని తెలిపారు.

మే లో టెండర్ లు పిలిచి.. మూడు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. జిల్లా నుంచి మండలం.. మండలం నుండి గ్రామాల వరకు కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. మీకు మాకు తేడా చాలా ఉందన్నారు.