పీసీసీ చీఫ్ ను కలిసిన తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, తో పాటు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరు చీఫ్ నకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని.. పార్టీ కోసం మరింత కస్టడీ పని చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం వీరంతా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓటింగ్ కు మరో వారం రోజుల వరకు ఉండటంతో ఎన్నికల వ్యూహం పై చర్చించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్యను భట్టి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 4 స్థానాలు దక్కగా.. వాటిలో తన మిత్రపక్షం సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరుగనుండగా.. అదే రోజు లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version