అన్నప్రసాదం, ట్రస్ట్ విరాళాలపై టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

-

తిరుమల, తిరుపతి దేవస్థానం ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ విరాళాలపై టీటీడీ బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడు కీలక ప్రకటన చేశారు. టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ విరాళాలు ఇప్పటివరకు రూ.2,200 కోట్లు దాటాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 10985లో తిరుమలలో అన్నదాన స్కీమ్ ను నాటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించారని.. 2014లో శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ గా టీటీడీ పేరు మార్చిందని గుర్తు చేశారు.

అలాగే నాడు 2వేల మందితో ప్రారంభమై.. నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి ట్రస్ట్ అభివృద్ధి చెందిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ లో అత్యధికంగా 9.7 లక్షల మంది దాతలు ఉన్నారని.. 1కోటి అంతకు మించి విరాళాలు ఇచ్చిన దాతల సంఖ్య 139 కి చేరిందని తెలిపారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44లక్షలు కాగా.. విరాళమిచ్చిన దాతలు 249కి చేరిందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు అన్నప్రసాదం పై ప్రత్యేకంగా దృస్టి సారించిందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version