రైతులకు గుడ్​న్యూస్.. మరో రెండ్రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు

-

సూర్యతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు.. వానాకాలం వచ్చి నెల పూర్తవడానికి వస్తున్న ఇంకా నారు వేయని రైతులకు.. హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించే సంకేతాలు అందించాయని తెలిపింది. ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైందని చెప్పింది. సోమవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని.. ఈమేరకు ఈ నెల 22వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రత సోమవారమూ కొనసాగింది. పలుచోట్ల సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండం, మెదక్‌, భద్రాచలం ప్రాంతాల్లో సాధారణం కన్నా 6 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 36 మండలాల్లో వడగాలులు వీచాయి. 10 మండలాల్లో తీవ్రత ఎక్కువగా నమోదయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version