తెలంగాణ పంచాయితీ ఎన్నికలు… పెరగనున్న గ్రామాలు !

-

 

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నిన్న జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు గ్రామాలు, వార్డులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

sarpanch

కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. 2019తో పోల్చితే 2025లో గ్రామాలు 12,848 నుంచి 12,788 కి, వార్డులు 1,13,354 నుంచి 1,12,694 కి తగ్గాయి. కాగా స్థానిక ఎన్నికలకు ముందుగానే ప్రభుత్వం మరో హామీని నెరవేర్చనున్నట్లుగా సమాచారం అందుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుంచి 55 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news