ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. NCC క్యాడెట్లకు కోర్సుల్లో ప్రవేశాలకు 15% వరకు గ్రేస్ మార్కులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కోర్సులలో ఎన్సిసి విభాగానికి ఒక శాతం సీట్లు ఉండగా వాటిని పొందినందుకు ఈ గ్రేస్ మార్కులు ఇవ్వబోతున్నారు.

సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ డెయిరీ సంబంధిత కోర్సుల్లో ఈ గ్రేస్ మార్కుల విధానం అమలుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. కాగా ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 21న కాలేజీలు బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం నిర్ణయించింది. డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలనే డిమాండ్ తో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.