KTR: తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.09 లక్షలు…ఇదే కేసీఆర్ ప్రగతి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తాజాగా తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాల లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ స్థానాన్ని సంపాదించుకుంది. తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడే నాటికీ ₹1,24,104 #PCI తో దేశంలో 10వ స్థానంలో ఉంది తెలంగాణ.
కానీ గత 9 ఏండ్లలో 7 రాష్ట్రాలను అధిగమించి ₹3,08,732 తో దేశంలో 3వ స్థానానికి, పెద్ద రాష్ట్రాల్లో 1వ స్థానానికి చేరుకుంది తెలంగాణ రాష్ట్రం. అయితే.. ఈ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ₹ 3.09 లక్షల తలసరి ఆదాయం తో పెద్ద రాష్ట్రాల లో దేశం లోనే తెలంగాణ No -1 అన్నారు. అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి..చేరిపెస్తే చెరగని సత్యం కేసిఆర్ గారు సాధించిన ఆర్థిక ప్రగతి…జై తెలంగాణ అంటూ పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.