పబ్లిక్ లో రీల్స్ పై తెలంగాణ పోలీసుల వార్నింగ్..!

-

పబ్లిక్ లో రీల్స్ చేసే వారికి తెలంగాణ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వీడియోల కోసం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దు అని పోలీసులు సూచించారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా ఎలాంటి దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేసిన కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

అలాగే యూట్యూబర్ మహాదేవ్ పై 336, 341, 290 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు, BNS 292 125 కింద KPHB పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అయితే ఈ యూట్యూబర్ మహాదేవ్ పబ్లిక్ ప్లేస్ లో ముఖ్యంగా ట్రాఫిక్ లో డబ్బులను చల్లుతూ.. వాటి కోసం వచ్చిన వారిని రికార్డ్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. ఇదే విధంగా నిన్న కూకట్ పల్లి ట్రాఫిక్ లో ఇతను డబ్బులు చల్లడంతో వాహనదారులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news