తెలంగాణ రైతులకు అలర్ట్‌…రైతు భరోసా కావాలంటే ఇలా చేయాల్సిందే !

-

Telangana Rythu Bharosa Guidelines : తెలంగాణ రైతులకు అలర్ట్. రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందేనంటూ ఓ వార్త వైరల్‌ గా మారింది. రైతు భరోసా కోసం రైతులు ప్రతి పంటకు సాగు పత్రాలు ఇవ్వాలని ఆదేశించబోతుందని తెలంగాణ సర్కార్‌. ఆన్లైన్ పోర్టల్ లేదా ప్రజా పాలన ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచనలు చేయనుందట.

Telangana Rythu Bharosa Guidelines

రైతులు ఇచ్చిన సాగు పత్రాలను ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ స్థాయి అధికారులతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని అంటున్నారు. తోటలకు ఒకసారే రైతు భరోసా ఇవ్వాలని గురువారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో ఈ సిఫారసులకు ఆమోదం తెలిపే ఛాన్స్‌ ఉందని సమాచారం.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన.. ఇవాళ మధ్యాహ్నం… నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. దీంతో రైతు భరోసాపై ఏ౦ తేలుస్తారో ? అనే టెన్షన్‌ అందరిలోనూ ఉంది. నేడు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version