కోల్‌కతాలో గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..

-

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూతురు సనాకు పెను ప్రమాదమే తప్పింది. శుక్రవారం సాయంత్రం కోల్‌కతా డైమండ్ హర్బర్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టింది. ఆ టైంలో డ్రైవర్ కారు నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. డైమండ్ బెహలా చౌరస్తా వద్ద వారు ప్రయాణిస్తున్న కారును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.

కారు డ్రైవర్‌ బస్సును వెంబడించి కొంత దూరం వెళ్లాక దానిని అడ్డగించాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. గంగూలీ కూతరు సనా ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌ను లోకల్ పోలీసులు అరెస్టు చేశారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version