తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. గత ఏడాదికారంగా సర్పంచులు లేక గ్రామపంచాయతీలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… గ్రామపంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది.

జూన్ 2న పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఇటీవల పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, యువవికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తుందని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.