తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థుల అకౌంట్లలో కాస్మోటిక్ చార్జీలు నేరుగా జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు. జూన్ నెల చివరి లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టంగా వెల్లడించారు.

కాస్మోటిక్ చార్జీల చెల్లింపు విధివిధానాలపై సమీక్షించిన తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఈ విషయాన్ని… ప్రత్యేకంగా … చూస్తున్నారు. స్కూల్స్ ప్రారంభం కాగానే విద్యార్థుల ఆధార్ అలాగే ఫోటోలను బ్యాంకులకు అనుసంధానం చేసి, వారి ఖాతాలకు… డెబిట్ కార్డులు కూడా అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ స్కీం ద్వారా ఆరు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కూడా స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ లెక్కలు.