తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వైరస్ కారణంగా తొలి మరణం నమోదు అయింది. తెలంగాణ రాష్ట్రంలో గిలియన్ బార్ సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి కారణంగా తొలి మరణం సంభవించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
సిద్దిపేట జిల్లా సమీపంలోని సీతారాం పల్లికి చెందిన… 25 సంవత్సరాల ఓ మహిళ… GBS వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. నెల రోజుల కిందట నరాల నొప్పిలతో స్థానిక ఆసుపత్రిలో ఆ మహిళా చేరడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ అలాగే ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చు చేసి.. ఆమెకు వైద్యం అందించారు. అయినప్పటికీ ఆమె వ్యాధి తీవ్రతరం కావడంతో మరణించడం జరిగింది. నిన్న చికిత్స పొందుతూ సదరు మహిళ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.