Rachin Ravindra: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రకు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ గడ్డపై తీవ్రంగా గాయపడ్డాడు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర. దీంతో.. రచిన్ రవీంద్రను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న తొలి వన్డే మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా…. పాకిస్తాన్ బ్యాటర్ కొట్టిన షాట్ కారణంగా రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. పాకిస్తాన్ ప్లేయర్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో… గాయపడ్డాడు రచిన్ రవీంద్ర. రాత్రిపూట కావడంతో లైటింగ్స్ ఎఫెక్ట్… కళ్ళకు కొట్టింది. దీంతో బంతి ఎటువైపు వస్తుందో గమనించలేకపోయాడు రచిన్ రవీంద్ర. ఈ తరుణం లోనే రచన్ రవీంద్ర ముఖం పగిలింది. ఇక రచిన్ రవీంద్ర కు జరిగిన సంఘటన వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది.
న్యూజిలాండ్ – పాకిస్తాన్ వన్డే మ్యాచ్ లో రచిన్ రవీంద్రకు తీవ్ర గాయం
బంతి నేరుగా ముఖానికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2025