జిల్లాల కుదింపుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ…జిల్లాల కుదింపుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏ జిల్లాని తీసేయాలని కాని కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 621 మండలాలు, 76 రెవిన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు.
ఇక అటు సీతక్క మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జులై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేశామన్నారు. సర్వే లో 4 లక్షల 49 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించామని వివరించారు. 3 లక్షల 21 వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా లక్షా 28 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సిన అవసరముందని వెల్లడించారు.
ఏ జిల్లాని తీసేయాలని కాని కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదు
రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 621 మండలాలు, 76 రెవిన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయి – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి pic.twitter.com/zJ5gAPbDwb
— Telugu Scribe (@TeluguScribe) December 17, 2024