CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక ప్రతియేటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు CM రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… ప్రతియేటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 అని… తెలంగాణ ఏర్పాటు కు చిదంబరం ప్రకటనతో పునాది రాయి పడిన రోజు డిసెంబర్ 9 అని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా డిసెంబర్ 9 గుర్తిస్తున్నాం…తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా పార్టీలు, వ్యక్తులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని వివరించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ తల్లిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదని వివరించారు. తెలంగాణ తల్లి ని గుర్తించకపోవడం ప్రజలకు పెద్ద లోటు అని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు మార్పులు చేశామన్నారు.తెలంగాణ తల్లి విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు.