వారి స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు – సీఎం రేవంత్

-

తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ, సమ్మక్క – సారక్క పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. కుడి చేతిలో జాతికి అభయాన్ని ఇస్తున్నట్లు, ఎడమ చేతిలో వరి, జొన్నలు, సజ్జ వంటి పంటలతో విగ్రహాన్ని తయారు చేశామన్నారు.

తాము ఏర్పాటు చేస్తున్న విగ్రహం రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి అంటే ఓ భావోద్వేగం అన్నారు. మెడకు కంటే, గుండుపూసల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందన్నారు. పుట్టుక నీది, చావు నీది అన్న కాలోజీ మాటల స్ఫూర్తితో యువత ఉద్యమించిందని, అగ్నికీల్లలో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనకడుగు వేయలేదన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అన్నారు రేవంత్. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news