తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

-

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది.
ఈ అల్పపీడనం దసరా (బుధవారం) నాటికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరుగా.. బుధ, గురువారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు ఈ రెండ్రోజులు అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version