గాడ్ ఫాదర్ లో 10 సర్ ప్రైజ్ లు : మోహన్ రాజా

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు.

దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. తాజా గాడ్ ఫాదర్ పై దర్శకుడు మోహన్‌ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్ ఫాదర్ లో 10 సర్ ప్రైజ్ లు ఉంటాయని ఆ సినిమా దర్శకుడు మోహన్ రాజా పేర్కొన్నారు.

మళయాలంలోని సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. ఆ సినిమాలో మోహన్ లాల్ కేవలం 50 నిమిషాలు స్క్రీన్‌ పైన కనిపిస్తే.. ఇందులో చిరంజీవి 2 గంటలు కనిపిస్తారని చెప్పారు. ఈ సినిమాలో పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయని.. చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని ఆ సినిమా దర్శకుడు మోహన్ రాజా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version