Telangana will host Olympics in 2036 said Revanth Reddy: తెలంగాణలో 2036 సంవత్సరంలో ఒలంపిక్స్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మారథాన్-24లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని తెలిపారు.
ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తామని ప్రకటించారు. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామని పేర్కొన్నారు. దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.