తెలంగాణాలో మొదటి సర్పంచ్, ఉప సర్పంచ్ ఏకగ్రీవాల హడావిడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందే సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సర్పంచ్, ఉప సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకునాన్రు గ్రామస్థులు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నర్ర కనకయ్యను సర్పంచ్‌గా, రాజ్‌కుమార్‌ని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నట్టు ప్రకటన చేశారు. గ్రామంలో గుడి కట్టేందుకు సర్పంచ్ అభ్యర్థి తన సొంత భూమి ఇస్తానని కూడా చెప్పినట్టు సమాచారం అందుతోంది.