ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. దాదాపు 40కి పైగా అజెండా అంశాలతో సమావేశం జరుగనుంది. అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

రెండు SIPB సమావేశాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి రూ.50 వేల కోట్లకుపైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది ఏపీ కేబినెట్.