తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనుండగా ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతాయి. ఎన్నికలకు ఫిబ్రవరి 03న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 03న ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నాయి.

ఈ ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే బీజేపీ తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం కాస్త ఆలస్యం వహిస్తున్నాయనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version