తెలంగాణ, ఏపీకి బిగ్ అలర్ట్..ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారం వరకు చలిగాలులు వీస్తాయని, రెండోవారంలో ఉదయం వేడిగాలులు, సాయంత్రం చలిగాలులు వీస్తాయని తెలిపారు.
అదే నెల మూడో వారంలో మళ్లీ చలి పెరుగుతుందని, నాలుగో వారంలో ఎండల తీవ్రత మొదలవుతుందని తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం ఏప్రిల్ వరకు కొనసాగుతుందని ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే మార్చిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.