మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ మంగళవారం మంత్రి తలసానికి మెమోరాండం ఇచ్చేందుకు ఆశా వర్కర్లు ఆయన నివాసానికి వెళ్లారు. కానీ మంత్రి అందుబాటులో లేరని అక్కడి సెక్యూరిటీ చెప్పడంతో వారు వినకుండా తలసాని నివాసం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు తరలిరావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమకు కనీస వేతనం 18000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఆశా వర్కర్లు. అలాగే పెండింగ్ లో ఉన్న పిఆర్సి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం అమలు చేయకపోవడం దారుణం అన్నారు.