HCU తరహాలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత

-

తెలంగాణ రాష్ట్రంలో HCU కంచ గచ్చిబౌలి తరహాలో మరో ఘటన జరిగింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బొటానికల్ గార్డెన్స్ లో భారీ వృక్షాలను తొలగించారట. 20 జేసీబీల సహాయంతో వృక్షాల తొలగించారని అంటున్నారు. వృక్షాల తొలగింపు అడ్డుకున్నారు విద్యార్థులు.. వృక్షో రక్షతి రక్షితః అంటూ భారీ వృక్షాలను ఎందుకు తొలగిస్తున్నారంటూ నిలదీశారు విద్యార్థులు.

Tension at Rajendranagar Agricultural University at midnight
Tension at Rajendranagar Agricultural University at midnight

అర్ధరాత్రి స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టారు. హాస్టల్‌ వద్ద పొలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్టల్‌ గదిలో నుండి విద్యార్థులను బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. 100 ఎకరాలు హైకోర్టు నిర్మాణానికి తీసుకొని.. ఇప్పుడు వనమహోత్సవం అంటూ 20 ఎకరాలు చదును చేస్తున్నారు. రేపు జరగబోయే సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటాం.. వన మహోత్సవం పేరుతో పచ్చని చెట్లను నరుకుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news