ఈ నెలలో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

-

తెలంగాణ ప్రాంత వాసులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అనౌన్స్ చేశారు. గడిచిన ఆరు నెలలలో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు అందించినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ నెలలో కొత్తగా మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

uttam
uttam

వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈనెల 11న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో కొత్తగా రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రజలకు రేషన్ కార్డులు కూడా ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news