TGPSC Chairman Burra Venkatesham: గ్రూప్ 2 పరీక్ష పై చివరి క్షణంలో TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం కీలక ప్రకటన చేశారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు బుర్రా వెంకటేశం. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసామని తెలిపారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరిక్షకు హాజరు కావాలని కోరారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని వెల్లడించారు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం.
ఫలితాలు త్వరలోనే ఇస్తామని ప్రకటన చేశారు. 4 సార్లు వాయిదా పడ్డ తరువాత ఈ సారి పరీక్షలు జరుగుతున్నాయన్నారు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం. గ్రూప్ 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2 కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలు గమనించాలని కోరారు. ఆందోళన అవసరం లేదని తెలిపారు.