పేదల ఇళ్లు కూల్చొద్దు : తమ్మినేని

-

ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దు అని తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులు, నాలలలో వున్న నిర్మాణాలను తొలగిస్తున్న సందర్భంగా పేదలు, మధ్యతరగతి ప్రజానీకం దీనికి సమిధలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్ధ ఆహ్వానించదగ్గదే. అయినప్పటికీ చెరువులు, నాలల పక్కన సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వారి ఇళ్లను కూల్చవద్దని CPIM తెలంగాణ రాష్ట్రకమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 78 మంది వికలాంగులకు ఇళ్లపట్టాలు ఇచ్చింది. ఆ ఇళ్లను ఆక్రమణల పేరుతో గురువారం తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చివేశారు. సంవత్సరాలు తరబడి అక్కడే నివాసముంటూ కాయకష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న పేదలు బజారున పడ్డారు. వీరిని తక్షణం ఆదుకోవాలి. హైడ్రా పేరుతో హైదరాబాద్‌ లోని హస్మత్‌పేట్‌, ఆల్వాల్‌ తదితర బస్తీలలో కూడా పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. ఆక్రమణలు, ఎఫ్‌టిఎల్‌, బఫర్‌జోన్‌ల పేరుతో ప్రత్యామ్నాయం చూపకుండా పేదలు, మధ్యతరగతి వారిని బజారుపాలు చేయవద్దని CPIM రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నది అని తమ్మినేని వీరభద్రం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version