కాంగ్రెస్ రమ్మని పిలుస్తున్నా.. వెనకడుగు వేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కారణం అదేనని టాక్..

-

ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.. శ్రావణమాసంలో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు లీకులిస్తూ వచ్చారు.. కానీ అదేమీ జరగలేదు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటకి చేరుతున్న ఎమ్మెల్యేలకి అక్కడి పరిస్థితులు అనుకూలించడంలేదనే ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ రమ్మని పిలుస్తున్నా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వెనకడుగు వేస్తున్నారట..

కేసీయార్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు…. కాంగ్రెస్ లో అవే షాకులు తగులుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ లో చేరిక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పా.. మిగిలిన వారందరూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనే వాదన వినిపిస్తోంది.. నేతల సమన్వయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోకపోవడంతో.. జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రతి చోటా సమస్యలు ఎదురవుతున్నాయట..

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్‌ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గం సహకరించకపోవడం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి సరితతో విభేదాలు ఉండటాన్ని బీఆర్ ఎస్ నేతలు హైలెట్ చేస్తుండటంతో.. జంప్ అవ్వాలనుకునే వారు కూడా ఆలోచనలో పడుతున్నారట..

అధికార పార్టీలోకి వెళ్లి ప్రాధాన్యత కోల్పోవడం కంటే స్వంత పార్టీలోనే ఉంటూ.. పోరాడటం నయమనే భానవలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారట.. బీఆర్ ఎస్ ను చావుదెబ్బ కొట్టాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డికి స్వంత పార్టీత నేతలే సహకరించడం లేదని.. అందుకే పార్టీలో చేరేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదనే చర్చ నడుస్తోంది.. పార్టీలో చేరిన వారికి.. పార్టీలో ఉన్న పాతతరం నేతలకు మధ్య సమన్వయం కుదర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు విఫలమవుతున్నారట.. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఎవ్వరూ సముఖత చూపడం లేదని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్..

Read more RELATED
Recommended to you

Exit mobile version